ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా

Aug 17 2025 6:05 AM | Updated on Aug 17 2025 6:05 AM

ఆలయ అ

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా

● ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

ధర్మారం(ధర్మపురి): మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామంలో గల శ్రీఅభయకృష్ణ ఆలయంలో శనివారం సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, డైరెక్టర్‌ బద్దం గంగారెడ్డి, సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్ర

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రాష్ట్రంలో యూరి యా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు. శనివారం రామగుండం ఎరువుల కర్మగారాన్ని సందర్శించి అమ్మోనియా లీకై న హెచ్‌టీఆర్‌ కనెక్టర్‌ మరమ్మతు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కర్మాగారం నిర్మాణంలో నాణ్యత లోపించడంతో అమ్మోనియా ప్లాంట్‌లో పైప్‌లైన్‌ లీకయి షట్‌డౌన్‌ చేయాల్సిన దుస్థితి వస్తుందన్నారు. మూడునెలల్లో కర్మాగారాన్ని మూడుసార్లు షట్‌డౌన్‌ చేశారని, అమ్మెనియా ప్లాంట్‌లో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుపుతున్న కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాలో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్లాంటుకు ఆనుకొని ఉన్న వీర్లపల్లి గ్రామాన్ని తరలించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో అలోక్‌ సింఘాల్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మహంకాళి స్వామి, నెలకంటి రాము, చిట్టబోయిన రాజ్‌కుమార్‌, బూర్ల శ్రీనివాస్‌, కందుల సతీశ్‌, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారుల నిరసన

గోదావరిఖని(రామగుండం): సింగరేణి యాజ మాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులు శనివారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు, వర్క్‌టూ రూల్‌ వంటి ప్రతిపాదనలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు పొనుగోటి శ్రీనివాస్‌, పెరుమాళ్ల శ్రీనివాస్‌, ఆంజనేయులు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ డి.రమేశ్‌, అధికారులు పైడీశ్వర్‌, డి.రమేశ్‌బాబు, అనిల్‌గబాలే, పర్సనల్‌ మేనేజర్‌, ఎం.రవీందర్‌రెడ్డి, రాజన్న పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి  నిధులు కేటాయిస్తా1
1/2

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా

ఆలయ అభివృద్ధికి  నిధులు కేటాయిస్తా2
2/2

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement