
కన్నయ్యా.. చల్లంగా చూడయ్య
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఉట్టిగొట్టేందుకు చిన్నారులు పోటీపడడాన్ని చూసిన వారంతా సంబరపడ్డారు. బీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్‌కిరణ్, నాయకులు సత్యం, బొమ్మకంటి రవి, మురళి, తారాబాయి, కవిత, వేదశ్రీ, శ్రీవాణి తదితరులున్నారు. శాంతినగర్‌లోని యాదవ చారిటబుల్ ట్రస్టు ఆఫీసులో శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. మారం తిరుపతి, మేకల మల్లేశం, పర్వతాలు, రాజేందర్, ఓదెలు, లక్ష్మణ్, పోచం తదితరులున్నారు.

కన్నయ్యా.. చల్లంగా చూడయ్య