
లోతట్టు ప్రాంతాలు జలమయం
జ్యోతినగర్(రామగుండం): రా మగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. శని వారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జంగాలపల్లెలోని లో తట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలో కి వరద నీరు చేరింది. రోడ్డుపై మూడడుగల పైన వరద నీరు ప్రవహించింది. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి రవి డివిజన్‌లో పర్యటించి సమస్యను రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు తెలిపారు. దీంతో ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జేసీబీతో కాలువలు తవ్వించారు. వరద నీరు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేందుకు సహాయ చర్యలు చేపట్టారు. జంగాలపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌కు, రవికి కృతజ్ఞతలు తెలిపారు.