
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
గోదావరిఖని: బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగం గురువారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్, కోర్టు, దర్యాప్తు కేసులపై ఆరా తీశారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రతీఒక్కరు క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్సైలు భూమేశ్, రమేశ్ పాల్గొన్నారు.