
బీదబిడ్డల చదువంటే మంత్రికి చులకనే..
మంథని: అట్టడుగు వర్గాలకు చెందిన బిడ్డల ఉన్నత చదువులంటే మంత్రికి చులకనేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న మంత్రి.. జేఎన్టీయూలో స్థానికేతర విద్యార్థులు 118మంది ఉంటే 72మంది మంథనికి చెందిన వాళ్లుఉన్నారని, పాలిటెక్నిక్‌లో వంద మందికి కేవలం 16మంది మాత్రమే మంథని ప్రాంతవాసులు ఉన్నారని, తద్వారా ఇవి ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టించడం తప్ప పేదవిద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచన లేదన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని ఎన్నిప్రయత్నాలు చేసినా భయపడేది లేదని, శ్వాస ఉన్నంతవరకు ప్రజల కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, గోనే శ్రీనివాసరావు, మాచిడి రాజుగౌడ్, వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.