
ప్రజారోగ్యంతో చెలగాటం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, బయో మెడికల్ వేస్ట్(జీవ వైద్య వ్యర్థాలు) నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీనగర్‌లో బల్దియా పారిశుధ్య విభాగం అధికారులు గురువారం చేసిన తనిఖీల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు బహిరంగ ప్రదేశాల్లో పడేసిన బయో మెడికల్ వేస్ట్ వెలుగు చూసింది. ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్‌ను బయట పడవేసిన శ్రీఅదితి హాస్పిటల్‌కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్‌కు రూ.50వేలు, వెంకటసాయి క్లినికల్ ల్యాబ్‌కు రూ.10వేలు జరిమానా విధించారు. బయో మెడికల్ వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించడంతోపాటు మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.