
ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పు ఇవ్వండి
● స్వశక్తి సంఘాలకు కలెక్టర్ శ్రీహర్ష సూచన
పెద్దపల్లిరూరల్: ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన స్వశక్తి సంఘాల మహిళలకు రూ.లక్ష అప్పు ఇ వ్వాలని కలెక్టర్ కో య శ్రీహర్ష స్వశక్తి సంఘాల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యాలు పూర్తికావాలని సూచించారు. ఈనెల 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్‌కామ్ ద్వారా అవగాహ న సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పీఎంశ్రీ పాఠశాల, యంగ్‌ఇండియా గురుకులాలు, జూనియర్, డిగ్రీకాలేజీలు, గోదావరిఖని శాతవాహన యూనివర్సిటీ అడ్మిన్‌బ్లాక్, సుల్తానాబాద్ బాలసదనం తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. రూ.23.75 కోట్లతో చేపట్టిన గోదావరిఖని ఆస్పత్రి అభివృద్ధి, రూ.22కోట్లతో మంథనిలో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ వేణు, డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, ఈఈ అశోక్‌కుమార్, ఏఈ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.