
విశ్వగురుగా భారత్
అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరణ
సాంకేతిక రంగంలోనూ శరవేగంగా వృద్ధి
ఇంజినీరింగ్ విద్యార్థుల అభిప్రాయం
‘ట్రినిటి’ కాలేజీలో టాక్‌షో
‘ప్రపంచంలోనే మనదేశం తిరుగులేని శక్తిగా అ వతరిస్తోంది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం అన్నిరంగాల్లో దూసుకెళ్తోందని’ వక్తలు అన్నారు. స్థానిక ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో ‘స్వతంత్ర భారతం.. వందేళ్ల భవితవ్యం’ అంశంపై ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కాలేజీ అటానమస్ అకడమిక్ డైరెక్టర్ అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్, కో ఆర్డినేటర్ అశోక్, హెచ్‌వోడీ ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. మనదేశం అంతరిక్ష ప్రయోగాల్లో నూ రాణిస్తోందని తెలిపారు. యువశక్తి సంకల్ప దీక్షతో దేశఔన్నతాన్ని పెంచేలా ముందుకు సాగా లని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరుగుతోందన్నారు. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో నూ సూపర్‌పవర్‌గా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. స్వతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్త య్యే నాటికి భారత్ ప్రపంచంలోనే రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సైనిక తదితర రంగాల్లో అగ్రగామిగా నిలిచి విశ్వగురుగా అవతరిస్తుందని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
– పెద్దపల్లిరూరల్
ఉపాధి కల్పించాలి
యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎదగాలి. పోటీ యుగంలో నెగ్గేందుకు నైపుణ్యం పెంపొందించాలి. ఉపాధి పొందడం కోసం కాకుండా పలువురికి ఉపాధి కల్పించేలా ఎదగాలి.
– బండారి రాహుల్, సీఎస్‌ఈ
మన సంస్కృతి గొప్పది
మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి. పాశ్చాత్య దేశాలన్నీ మన సంస్కృతి పాటిస్తున్నాయి. మనం పరాయి పాలనలోని దురలవాట్లు పాటిస్తున్నాం. వాటినుంచి బయటపడి దేశ ఔన్నత్యాన్ని పెంచాలి. – ఆఖ్య, ఈసీఈ
కుల, మతాలకు తావుండదు
ఇప్పుడున్న కుల, మతాలు భవిష్యత్‌లో ఉండక పోవచ్చు. మనుషులంతా ఒక్కటే అనే భావన పెరిగి పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకు సాగే పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం చదువుకునే సమయంలోనే కులం అనే పదం వినిపిస్తోంది. – ఉస్మాన్, ఎంఐఈ
సాంకేతికతతో అభివృద్ధి
సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి కోర్సులను సద్వినియోగం చేసుకుంటూ యువత దేశ భవిష్యత్‌లో కీలకపాత్ర పోషించాలి.
– హసీనా, ఏఎంఐఈ
ఇంధన భద్రతపై దృష్టి
ఇంధన భద్రత కోసం ప్రపంచంలోనే అతిముఖ్యమైన బయోఫ్యూయల్ ఉత్పత్తిపై మనదేశం దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానం. స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలవాలి. ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటా పెంచాలి. – శివాని, ఏఎంఐఈ
ఉచితాలు వద్దు
మనదేశం ఆర్థికశక్తిగా ఎగబాకుతోంది. దీనికితోడు యువ త, ప్రజలకు అవసరమైన ఉపాధి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రజలకు ఉచితంగా లబ్ధి చేకూరే పథకాలను క్రమంగా తగ్గించాలి. యువత ఉత్పత్తి రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. – సయిఫ్, ఈసీఈ
ఐటీ రంగంలో మేటి
సాంకేతిక పరిజ్థానాన్ని యువ తకు అందిస్తూ ఐటీ రంగంలో మేటిగా ఉంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించి మనదేశం ప్రపంచంలోనే గొప్పగా ఉంటుంది. – మణిగణేశన్, ప్రిన్సిపాల్
సాంకేతికతపై పట్టుసాధించాలి
ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరిగింది. అందులో మన దేశం అన్నిరంగాల్లో ముందు కు దూసుకుపోతోంది. సాంకేతికత, ఇంటర్నెట్ వినియోగంపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఏఐ టెక్నాలజీ రాజ్యమేలడం ఖాయం.
– ప్రొఫెసర్ అశోక్, ఆర్ అండ్ డీ కో ఆర్డినేటర్
అన్నిరంగాల్లో ప్రగతి
మనదేశం అన్నిరంగాల్లో ప్రగతి సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. సౌర, జల విద్యుత్‌శక్తి ఉత్పత్తి పెరుగుతోంది. యువశక్తికి కొదవలేదు. వారు దేశ ఔన్నత్యం కోసం పాటుపడేలా శిక్షణ ఇవ్వాలి.
– ప్రభాకర్, ఈసీఈ హెచ్‌వోడీ
ఆటోమేషన్‌పై ఫోకస్
స్వతంత్ర భారతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటోమేషన్, టెక్నాలజీ తదితర రంగాలపై ఫోకస్ పెడితే ఆర్థికవృద్ధి సా ధిస్తుంది. ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందుంది.
– అశోక్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్

విశ్వగురుగా భారత్