
పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈనెల 15న జిల్లాలో నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకలకు తె లంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ అ బ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరువుతారని బు ధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఉద యం 10 గంటలకు కలెక్టరేట్‌లో ఆయన జా తీయ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
రామునిగుండాలకు జలకళ
రామగుండం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో రామునిగుండాల జలపాతం జాలువారుతూ కనువిందు చేస్తోంది. వాటర్‌ఫాల్స్ తి లకించేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పచ్చనిచెట్ల అందం, పర్చుకున్న పచ్చదనం ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. శ్రావణమాసం కావడంతో రామునిగుండాలతోపా టు రామునిపాదాలు దర్శించేందుకు భక్తులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో
రామగుండం: ఎగువన కురుస్తున్న భారీవర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ ర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.0 6 టీఎంసీలకు చేరింది. సుమారు 19,062 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు బుధవారం తెలిపారు. ఇందులో అత్యధికంగా కడెం ప్రాజెక్టు నుంచి 11,478 క్యూసెక్కులు వచ్చి చే రుతోంది. మరోవైపు.. ప్రాజెక్టు నుంచి హైదరా బాద్‌కు 330 క్యూ సెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.
జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం
జ్యోతినగర్(రామగుండం): మన జాతీయ జెండా చిహ్నం మాత్రమే కాదని, ఐక్యతకు గర్వకారణమని సీఐఎస్‌ఎఫ్ ఎన్టీపీసీ యూనిట్ సీనియర్ కమాండెంట్ అరవింద్‌కుమార్ అన్నారు. హర్ ఘర్ తిరంగా – 2025లో భాగంగా సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద బైక్ ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేకంగా అలంకరించిన బైక్‌లతో త్రివర్ణ పతాకం మోసుకెళ్లి, దేశభక్తి నినాదాలు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ర్యాలీలో సుమారు 150 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొని 15 కి.మీ. మేరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమాండెంట్ ఆంజనేయరాజు, ఓవీకే శాస్త్రి, అసిస్టెంట్ కమాండెంట్ తాళియన్ పాల్గొన్నారు.
ఢిల్లీలో వేడుకలకు చిల్లపల్లి పంచాయతీ కార్యదర్శి
మంథనిరూరల్: స్వచ్ఛ స ర్వేక్షణ్ భారత్ అమలులో చిల్లపల్లి గ్రామ పంచాయ తీకి జాతీయస్థాయి అవా ర్డు లభించిన విషయం వి దితమే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి చిల్లపల్లి కా ర్యదర్శి రాంకిశోర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సంపూర్ణ పారిశుధ్యం నిర్వహణలో చి ల్లపల్లికి అవార్డు దక్కగా అప్పటి సర్పంచ్‌తోపా టు పంచాయతీ కార్యదర్శి రాష్ట్రపతి నుంచి పు రస్కారం అందుకున్నారు. కాగా, గురువారం ప్రభుత్వం రాంకిశోర్‌ను సన్మానించనుంది. శుక్రవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరుకానున్నారు.
చెక్‌డ్యాం పనులకు రూ.35.54 కోట్లు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): నీరుకుల్ల మా నేరుపై నిర్మించిన చెక్‌డ్యాంకు రూ.35.54కోట్ల పరిపాలనా అనుమతి లభించిందని ఇరిగేషన్ డీఈఈ రాజేందర్ తెలిపారు. చెక్‌డ్యాం నిర్మాణానికి 2020లో రూ.21.02 కోట్లు సాంకేతికంగా మంజూరు కాగా, వాస్తవ పరిస్థితులైన కరకట్ట, రంగనాయకస్వామి ఆలయ ప్రహరీ పనికోసం ఇరిగేషన్ అధికారులు రూ.40.14కోట్లకు మంజూరు ఇవ్వాలని అభ్యర్థించారు.

పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా

పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా

పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా