
బిల్లులు ఇస్తున్నారా?
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులతో కలెక్టర్ ● ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి ● లేదంటే రద్దు చేసి ఇతరులకు ఇస్తాం ● కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: ‘అమ్మా.. మీకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇల్లు ఇచ్చింది.. చేసిన పనులకు బిల్లులు ఇచ్చారా..’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందిరమ్మ ఇళ్ల ల బ్ధిదారులను ప్రశ్నించారు. లబ్ధిదారులు సందనవేన గంగమ్మ, లాస్య మాట్లాడుతూ.. బిల్లులు వెంటనే ఇచ్చారన్నారు. పనులు చివరిదశకు చేరాయని సంతోషంగా చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి న నిమ్మనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని హౌ సింగ్ పీడీ రాజేశ్వర్‌తో కలిసి బుధవారం కలెక్టర్ ప రిశీలించారు. గ్రామంలోని అర్హులైన పేదలందరికీ 140 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 45 ఇళ్ల పనులే చేపట్టడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. పనులు చేపట్టేలా చూడాలని ఎంపీడీవో శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు సానుకూలంగా స్పందించకుంటే రద్దు చేసి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
సులభంగా అర్థమయ్యేలా బోధించాలి
నిమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. నాలుగో తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సారాంశం అర్థమైందా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సు లభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీడీ, ఎంపీడీవోతపాటు హెచ్‌ఎం సతీశ్, ఏఈ నరేశ్ తదితరులు ఉన్నారు.
వినోద రంగంలో నైపుణ్య కోర్సులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): వినోద రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులు అందిస్తున్నామని, ఆస క్తి గలవారు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాల యంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, డిజిట ల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
‘టాస్క్’పై అవగాహన కల్పించాలి
టాస్క్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. టాస్క్‌లో శిక్షణ పొందిన వారికి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జిల్లా ఉపాధి క ల్పనాధికారి తిరుపతిరావు, ముఖ్యప్రణా ళికాధికారి రవీందర్, కౌసల్య, గంగప్రసాద్ పాల్గొన్నారు.