
మొక్కల సంరక్షణ బాధ్యత మహిళలకే
● వారికి అప్పగిస్తే అవినీతికి తావుండదు ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
కోల్‌సిటీ(రామగుండం): మొక్కల సంరక్షణ బా ధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తే ప్లాంటేషన్‌కు కేటాయిస్తున్న రూ.కోట్లలో అవినీతికి తావుండ దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా బుధవారం రామగుండం బల్దియాలో మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏటా లక్షల్లో మొక్కలు నాటితే ఛత్తీస్‌గఢ్ జంగల్ తరహాలో చెట్లు కనిపించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. 10 వేల మొక్కలు నాటి లక్ష నాటినట్లు చూపిస్తే కాంట్రాక్టర్‌ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మహిళలు తమ కుటుంబసభ్యుల పేరిట మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో త్వరలో నే ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అధికారులు రామన్, షాభాజ్, తేజస్విని, సాయి, మౌనిక పాల్గొన్నారు. కాగా, మల్కాపూర్ శివారులోని డంపింగ్‌యార్డ్‌లో రూ.83 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, కౌపోస్ట్ షెడ్ పనులకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పాలకుర్తి మండలం గుంటూరుపల్లిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరై న తహసీల్దార్‌తోపాటు అధికారులపై రాజ్‌ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.