
ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దు
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: రానున్న 72 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో పోలీసుయంత్రాంగం అప్రమత్తమైందని అన్నారు. ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పో లీస్ అధికారులు లేదా డయల్ 100 నంబరుకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
డ్రగ్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. తన కార్యాలయంలో బుధవారం నాషాముక్త్ భార త్ అభియాన్–2025లో భాగంగా మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా ఉద్యోగులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. సీపీ మాట్లాడుతూ, గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, విక్రయించినా కఠిన చ ర్యలు తప్పవన్నారు. స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్, సీసీఆర్‌బీ, పీసీఆర్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు రాజ్‌కుమార్, సతీశ్, రవీందర్, బాబురావు, భీమేశ్, శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.