
దంచికొట్టిన వాన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జిల్లాలోని కాల్వశ్రీ రాంపూర్, ఓదెల మండలాల్లో మంగళవారం రాత్రి భారీవర్షం కురిసింది. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల – పోచంపల్లి, తారుపల్లి – మీర్జంపేట మధ్య ఒర్రెలపై కల్వర్టులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మల్యాల–జమ్మికుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై గూడెం విద్యత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఒర్రెపొంగింది. రాకపోకలు నిలిచి పోయాయి.
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్‌లోని మెరుగు పోశాని ఇంట్లోకి వరదనీరు వచ్చి చేరింది. గూడెం నక్కలవాగు అలుగుపారుతోంది. గూడెం – కాల్వశ్రీరాంపూర్ మధ్య రోడ్డు తెగింది. కొలనూర్, కనగర్తి, ఓదెల, పొత్కపల్లి, గుంపుల చెరువులు వరదనీటితో నిండి నిండుకుండలా కనిపిస్తున్నాయి. 300 కుంటలకు కూడా జలకళ సంతరించుకుంది.

దంచికొట్టిన వాన