
యూరియా కష్టాలు
● సొసైటీల వద్ద రైతుల పడిగాపులు ● వ్యవసాయ పనులు వదులుకొని నిరీక్షణ ● గంటల తరబడి బారులు తీరుతున్న వైనం ● అయినా, ఒక్కో రైతుకు రెండు బస్తాలే పంపిణీ
సాక్షి పెద్దపల్లి: వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువుల కోసం అన్నదాతలకు తిప్పలు ప్రారంభమయ్యాయి. వరినాట్లు మొదలైన 20 రోజుల తర్వాత యూరియా అవసరమవుతుంది. విత్తనాలు విత్తిన నాటినుంచీ చినుకు జాడలేక పైరు ఎండే పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యింది. ఇదేసమయంలో పంటలకు యూరియా అవసరం ఏర్పడింది. దీంతో తమ పనులన్నీ వదులుకొని సింగిల్‌విండోలు, ఇతర సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతూనే.. ఒక్కో ఆధార్ కార్డుపై రెండు బస్తాల యూరియా పంపిణీ చేయడం కొరతకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్, ఒదెల, పాలకుర్తి మండలాల్లో రైతులు యూరియా కోసం పీఏసీఎస్‌ల ఎదుట బారులు తీరడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది.
షరతులతో ఇబ్బందులు
జిల్లాలో సుమారు 2.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా, ఇప్పటివరకు వరి 1,42,153 ఎకరాలు, పత్తి 48,215 ఎకరాలు, కందులు 87 ఎకరాలు, మొక్కజొన్న 377 ఎకరాలు, మిగతా ఇతర పంటలు సాగు చేశారు. ఈసీజన్‌కు 32,447మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 17,036 మెట్రిక్ టన్నులే సరఫరా అయ్యింది. గతేడాది ఇదేసమయానికి 28,868 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. గతేడాదితో పోల్చితే.. సుమారు 12వేల మెట్రిక్ టన్నులు తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. ఆ లోటును పూడ్చేందుకు ఒక్కోరైతుకు రెండోబస్తా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా యూరియా బ్యాగ్‌లతోపాటు నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, జింక్ కొనుగోలు చేయాల్సిందేనని కొందరు వ్యాపారులు షరతులు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల బక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారు.
రైతులకు తప్పని తిప్పలు
జిల్లా సమాచారం
రైతుల సంఖ్య 1,61,032
సాగు లక్ష్యం(ఎకరాల్లో) 2,76,076
సాగైన వరి(ఎకరాల్లో) 1,42,153
సాగైన పత్తి(ఎకరాల్లో) 48,215
అవసరమైన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 32,447
ఇప్పటివరకు వచ్చిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 17,036
ఇంకా రావాల్సిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 15,411
గతేడాది ఇదే సమయానికి సరఫరా అయ్యింది(మె.ట.) 28,868
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సింగిల్‌విండో కార్యాలయం ఎదుట రైతులు ఉదయమే యూరియా కోసం బారుల తీరారు. ఆధార్, ప ట్టాదారు పాస్‌పుస్తకాలతో తరలివస్తే.. ఒక్కొక్క రికి ఒక యూరియా బస్తానే ఇచ్చారు. ఒకరం నుంచి పదెకరాల వరకు ఉన్న రైతులు.. ఒక్క యూరియా బస్తా ఎలా సరిపోతుందని సిబ్బందిపై ఆగ్రహం వ్య్తక్తం చేశారు. త్వరలోనే మరి కొంత వస్తుందని ఏవో నాగార్జున తెలిపారు.
బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలు..
ఓదెల(పెద్దపల్లి): మొత్తం 22 గ్రామాలకు ఏకై క సొసైటీ పొత్కపల్లి. ఇక్కడే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాదిమంది రైతులు ఉదయమే సొ సైటీ ఎదుట బారులు తీరా రు. తమకు యూరియా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆందోళన పరి స్థితులు ఏర్పడడంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు.. డీసీఎంఎస్‌లో యూరియాను బ్లాక్‌చేసి అధిక ధరలకు విక్రయించినట్లు రైతులు ఆరోపించారు.
పొద్దంతా పడిగాపులు
యూరియా కోసం పొ ద్దున్నే పొత్కపల్లి సొసైటీ వద్దకు వచ్చి న. యూరియా ఉందని తెలిసి చాలామంది రైతులు గుమికూడారు. ఈక్రమంలో తోచుకున్నారు. చివరకు పోలీసులు రా వడంతో అసంపూర్తిగా పంపిణీ చేశారు. – గుడి సుధాకర్‌రెడ్డి,
గోపరపల్లె

యూరియా కష్టాలు

యూరియా కష్టాలు

యూరియా కష్టాలు