
అక్షరాస్యత పెంపొందించాలి
పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరికి కనీస అక్షర జ్ఞా నం అందించేందుకు చేపట్టిన ఉల్లాస్, నవభారత్ అక్షరాస్యత కార్యక్రమాలు సద్వినియోగ మయ్యేలా చూడాలని డీఈవో మాధవి సూచించారు. రిసోర్స్‌పర్సన్‌లతో జిల్లా కేంద్రంలో సో మవారం ఆమె సమావేశమయ్యారు. చదువు రాని వారనే చిన్నచూపుతో వయోజనులను కించపర్చవద్దన్నారు. కనీస అక్షరజ్ఞానాన్ని అందిస్తే కుటుంబంలో మార్పు కనిపిస్తుందని తెలి పారు. జిల్లా రిసోర్స్‌పర్సన్ జక్కం శ్రీనివాస్, ప్రతినిధులు స్వరూప్‌చంద్, అనిల్‌ప్రసాద్ తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. వయోజనవిద్య ఏపీవో శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్ సురేందర్‌కుమార్ పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక శక్తి పెంచాలి
పెద్దపల్లిరూరల్: టీనేజీ పిల్లల్లో రక్తహీనతను నియంత్రించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచేవి ఆల్బెండజోల్ మాత్రలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చే శారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రై వేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మాత్ర లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్‌కుమార్, హెచ్‌ఎం అరుణ, ఆర్‌బీఎస్‌కే వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
అంతర్గాం పీహెచ్‌సీ సందర్శన
రామగుండం: అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలను జి ల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
జ్యోతినగర్(రామగుండం): ఆర్యవైశ్యుల అ భ్యున్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం ప ట్టణ పొలిటికల్ అడ్వైయిజర్ రావికంటి వరప్రసాద్ అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా సోమవారం ఆయన తన నా మినేషన్‌పత్రాన్ని ఎన్నికల అధికారులు వొల్లా ల సురేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌కు అందజేసి మాట్లాడారు. సంఘం బలోపేతానికి పాటుపడతానన్నారు. పేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే ఎన్నికల్లో తనకు మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. అనంతరం వరప్రసాద్‌కు మద్దతుగా హిందూ ఐక్యవేదిక సభ్యు లు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులుపాల్గొన్నారు.
కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో కొత్త మహిళా స్వశక్తి సంఘాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, బాలికల సంఘాల ఏర్పాటును ఈనెలాఖరు వ రకు పూర్తిచేయాలని డీఆర్డీవో కాళిందిని సూ చించారు. ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య ప్రతినిధులతో జిల్లా కేంద్రంలో సోమవారం ఆమె సమావేశమయ్యారు. కొత్తవారిని గుర్తించి స్వశక్తి సంఘంలో సభ్యత్వం పొందేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అడిషనల్ డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ రీఫిల్లింగ్ షాపుల్లో తనిఖీ
గోదావరిఖని: గ్యాస్ రీఫి ల్లింగ్ సెంటర్లలో పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. ఓ షాపులో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీస్ అధికారుల ఆదేశాల మేర కు సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో లక్ష్మీనగర్‌లోని గ్యాస్‌స్టవ్, సిలెండర్ షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రజాభద్రత, జీవనానికి భంగం కలిగించేలా వ్యవహరించిన 8 మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు.

అక్షరాస్యత పెంపొందించాలి

అక్షరాస్యత పెంపొందించాలి

అక్షరాస్యత పెంపొందించాలి

అక్షరాస్యత పెంపొందించాలి