
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిశితంగా పరిశీలించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ యన మాట్లాడారు. పదేపదే ఒకేసమస్యపై ఫిర్యా దులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.