
అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట
సొసైటీల వద్ద రైతుల పడిగాపులు వ్యవసాయ పనులు వదులుకొని నిరీక్షణ గంటల తరబడి బారులు తీరుతున్న వైనం అయినా, ఒక్కో రైతుకు రెండు బస్తాలే పంపిణీ
మంథనిరూరల్: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గుంజపడుగు శివారులో మంథని పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఎం కుసుమ్ ద్వారా రూ.3.50కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్, చిల్లపల్లిలో రూ.7 కోట్ల వ్యయంతో ఐదెకరాల్లో చేపట్టిన రెండు గోదాముల నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ఎనర్జీ పాలసీలో భాగంగా నందిమేడారం, కాల్వశ్రీరాంపూర్, అప్పన్నపేట, మంథని ప్రాంతాల్లో ఒక్కో మెగావాట్ చొప్పున పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4 నెలల్లో వీటిని పూర్తి చేయాలని మంత్రి సూచించారు. గుంజపడుగులో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డీవో సురేశ్, డీసీవో శ్రీమాల, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పాటుపడాలి
కమాన్‌పూర్(మంథని): సహకార బ్యాంకులు, సొసైటీలు రైతుల సంక్షేమానికి కృషి చేసేలా ఆధునిక భవనాలు నిర్మిస్తున్నామని ఐటీమంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్, రూ.65 లక్షలు వెచ్చించి నిర్మించిన పీఏసీఎస్ భవనాలను డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రాజీపడకుండా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, కమాన్‌పూర్, కన్నాల పీఏసీఎస్ చైర్మన్లు ఇనగంటి భాస్కర్‌రావు, బయ్యపు మనోహర్‌రెడ్డి, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, నాయకులు సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు