
రవాణా సౌకర్యంతోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే విజయరమణారావు ● ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్ష
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): రవాణా వ్యవస్థ మెరుగు పడితేనే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కదంబపూర్ – కాల్వశ్రీరాంపూర్ గ్రామాల మధ్య రూ.1.50 కో ట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎ మ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కదంబపూర్ వివేకానంద వి గ్రహం నుంచి కనుకుల ఎక్స్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సతీశ్, పన్నాల రాములు, దామోదర్‌రావు, కొడెం అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
ఎలిగేడు(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అవినీతికి తావులేకుండా చర్య లు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఇళ్ల పురోగతిని అధి కారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని అన్నారు. హౌ సింగ్ పీడీ రాజేశ్వర్, డీఈలు, ఏఈలు, ఎంపీడీ వోలు దివ్యదర్శన్, శ్రీనివాస్, పద్మజ, పూర్ణచంద ర్, తిరుపతి, భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు.