
కాలిపోతున్న కరెంట్ మోటార్లు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈ వర్షాకాలంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురువడంలేదు. దీంతోపా టు విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయంతో కరెంట్ మోటార్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కా లిపోతున్నాయి. ప్రస్తుతం నాట్లు వేసిన రైతులు.. సాగునీరు పారించే విద్యుత్ మోటార్లు మరమ్మతుకు వెళ్లడంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ పంపుసెట్ల ఆధారంగా..
ఈసారి ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమో దు అయ్యింది. దీంతో ఎక్కువ మంది రైతులు వ్యవసాయ బావుల వద్ద పంపుసెట్ల ఆధారంగా వివిధ పంటలు వేస్తున్నారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు నానాపాట్లు పడుతున్నా రు. ప్రధానంగా అత్యధికంగా విద్యుత్ వినియోగించడంతో కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయ ని అధికారులు చెబుతున్నారు. అయితే, లోవో ల్టేజీ సమస్యతోనే అవి కాలిపోతున్నాయని రైతు లు ఆరోపిస్తున్నారు. ఒకసారి కరెంట్ మోటారు కాలిపోతే మరమ్మతు కోసం సుమారు రూ.6000 – రూ.10,000 వరకు ఖర్చు అవుతోందని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాలితే రైతులపైనే భారం
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే దాని మరమ్మతుల ఖర్చును రైతులపైనే వేస్తున్నారని ఆరోపి స్తున్నారు. ట్రాక్టర్ తీసుకొని మరమ్మతు కేంద్రానికి తామే తరలించాల్సి వస్తోందంటున్నారు.
మరమ్మతులకు గురైన మోటార్లు
జూలై 258
ఆగస్టు 50