
రెండు బస్తాలే ఇచ్చారు
నాకు ఆరెకరాలు ఉంది. రెండు బస్తాలే ఇచ్చారు. ఇవి ఎన్నెకరాలకు సరిపోతయి? మిగతా యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి. పంటకు యూరియా ఎప్పుడు వేయాలి? అదను దాటితే కర్ర పెరగది. సరిపడా ఇవ్వాలె.
– గడికొప్పుల రాజయ్య,
వెన్నంపల్లి
కొరత లేదు
యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదనంగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దు. ప్రసుత్తం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. యూరియా కొరత ఏమీలేదు. – శ్రీనివాస్, డీఏవో

రెండు బస్తాలే ఇచ్చారు