
రెండుసార్లు కాలిపోయింది
వరినాటు వేసినప్పటి నుంచి కరెంట్ మోటారు రెండుసార్లు కాలిపోయింది. అధికారులకు చెబితే.. లో వోల్టేజీ సమస్య ఉందంటున్నరు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెట్టి కొత్త కనెక్షన్లు అనుమతి తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలి.
– ఆడెపు వెంకటేశ్వర్లు, కాట్నపల్లి
అనధికార కనెక్షన్లే సమస్య
రైతులు అనుమతి లేకుండా కరెంట్ వాడడంతోనే లో వోల్టేజీ సమస్య వస్తోంది. తద్వారా విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. బోరుబావుల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తాం.
– మాధవరావు, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో