
అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.కోటి 10లక్షల వ్యయ అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ అందించి నిర్మాణాలకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారే తప్ప ఏనాడు ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. కానీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు అందించి లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. నాయకులు ఆరె సంతోష్, రాజేందర్, చింతపండు సంపత్, మహేందర్, నరేశ్, రాజు, వీరేశం, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులున్నారు.
పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం
జూలపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా సొంతింటి కల సాకారం చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని కోనరావుపేటలో లబ్ధిదారుడు ఆవులమ్మ–ఐలయ్యకు మంజూరైన ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ఆదివారం చేయించి లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రాంగోపాల్‌రెడ్డి, డైరెక్టర్ చుక్కయ్య లబ్దిదారులు పాల్గొన్నారు.