
బస్‌షెల్టర్లు అవసరం
ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్‌షెల్టర్లు అవసరం. బస్సుల కోసం చెట్ల కింద, దుకాణాల ముందు నిలబడాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి.
– కొమ్ము కరుణాకర్, పెద్దపల్లి
దాతలు ముందుకురావాలి
ప్రయాణికుల సౌకర్యం కోసం అనువుగా ఉన్న ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు నిర్మించేందుకు స్వచ్ఛందసంస్థలు, దాతలు ముందుకు రావాలి. ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా దృష్టిసారించాలి. – సోడా బాబు, పెద్దపల్లి
ప్రయాణికుల ఇబ్బందులు
స్టేజీల వద్ద బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు చా లా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు తోడు పెద్దపల్లిలోని బస్‌స్టాప్‌ల వద్ద ప్రైవేట్ వాహనదారులతో సమస్య ఏర్పడుతోంది. అధికారులు చొరవచూపి సమస్య పరిష్కరించాలి. – కల్వల రాజేశం, పెద్దకల్వల

బస్‌షెల్టర్లు అవసరం

బస్‌షెల్టర్లు అవసరం