రిక‘వర్రీ’ | - | Sakshi
Sakshi News home page

రిక‘వర్రీ’

Aug 10 2025 8:30 AM | Updated on Aug 10 2025 8:30 AM

రిక‘వ

రిక‘వర్రీ’

రాఖీ సంబురం

ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లావ్యాప్తంగా శనివారం సంబురంగా జరుపుకొన్నారు. స్థానికంగా ఉన్నవారితోపాటు సుదూర ప్రాంతాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో స్థిరపడినవారు, విదేశాల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టారు. నోరు తీపి చేశారు. సోదరులు కట్నకానుకలు ఇస్తూ సంబురాలు చేసుకున్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తదితర ప్రముఖులకు పలువురు రాఖీలు కట్టి సోదరభావం పంచారు. – పెద్దపల్లిరూరల్‌

సీ్త్రనిధి రుణాలు పక్కదారి

వీవోఏ, సీసీలు, బుక్‌ కీపర్లు, ఆర్పీల మాయాజాలం

సోషల్‌ ఆడిట్‌లో గుర్తించిన అధికారులు

రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అమలుకు సన్నద్ధం

100 శాతం రికవరీ లక్ష్యం

రామగిరి మండలానికి చెందిన వీవోఏ రూ.3.57లక్షలు అక్రమంగా రుణం తీసుకున్నారు. అంతేకాదు.. రూ.34.43 లక్షల రుణవాయిదాల సొమ్మునూ సొంతానికి వాడుకున్నారు. ఇలా మొత్తంగా రూ.38.01లక్షలను 26 మహిళా గ్రూపుల్లోని 172 మంది సభ్యుల డబ్బులు దుర్వినియోగం చేశారు.

పాలకుర్తికి చెందిన వీవోఏ ఒకరు.. సభ్యులకు తెలియకుండా రూ.2.5 లక్షలు రుణం తీసుకున్నారు. సీ్త్రనిధికి చెల్లించాల్సిన రూ.10.25 లక్షలు రీపేమెంట్‌ చేయకుండా కాజేసినట్లు సోషల్‌ ఆడిట్‌లో తేలింది.

ఇలా జిల్లావ్యాప్తంగా మెప్మా ద్వారా మంజూరు చేసిన సీ్త్రనిధి రుణాల్లో రూ.4.81కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.4.01 కోట్లు రికవరీ చేశారు. సెర్ప్‌ ద్వారా మంజూరు చేసిన సీ్త్రనిధి రుణాల్లో రూ.13.87 కోట్లు కూడా దుర్వినియోగం చేశారు. ఇందులోని రూ.6.24కోట్లు రికవరీ చేశారు.

సాక్షి, పెద్దపల్లి: పేదరిక నిర్మూలన, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డ్వా క్రా సంఘాల ద్వారా సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తోంది. అయితే, కొందరు ఉద్యోగుల తీరుతో రుణాలు, రుణవాయిదాల సొమ్ము పక్కదారి పడుతోంది. సెర్ప్‌, మెప్మా ద్వారా మహిళా సంఘాలకు అందాల్సిన బ్యాంకు రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, వడ్ల కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే పొదుపు సంఘాల లెక్కలు సరిచేసే వీవోఏలు, ఆర్పీలు, సీసీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. వాయిదాలు చెల్లించిన సందర్భంలో పాసుపుస్తకాల్లో సంతకాలు చేయడానికి కూడా ఆర్పీలు రూ.100 చొప్పున మహిళా సభ్యుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఆర్థిక చేయూతకు సీ్త్రనిధి..

పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీ్త్రనిధి బ్యాంకు ఏర్పాటు చేసింది. దీనినుంచి రుణాలు మంజూరు చేస్తూ మైక్రోఫైనాన్స్‌ల నిర్వాహకుల అధికవడ్డీల బారీనుంచి కాపాడాలనేది దీనిలక్ష్యం. ఇందులో పేద మహిళలకు స్వయం సహాయక గ్రూపుల పేరిట సభ్యత్వం ఇస్తూ ప్రతినెలా కొంత పొదుపు చేయించేలా ప్రణాళిక రూపొందించింది. ఇలా ఒక్కో గ్రూపులో 10 మంది మహిళలను సభ్యులుగా చేర్చుకుంటారు. ఆర్నెల్లు నిండిన ప్రతీగ్రూపు రుణం పొందేందుకు అర్హత సాధిస్తుంది. రుణం తీసుకున్న సభ్యుల నెలసరి వడ్డీని బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. అయితే, రుణాలు మంజూరు చేయించే సమయంలోనే ఆర్పీలు ప్రతీసభ్యురాలి నుంచి చెల్లించే నగదుపై రూ.500 రూ.1000 వరకు కమీషన్‌ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రుణం రికవరీ సమయంలో వసూలు చేసిన వాయిదా డబ్బులను సైతం కొందరు ఆర్పీలు బ్యాంకులో చెల్లించకుండా తమ సొంతానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల పర్యవేక్షణ కరువు

క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారా, అప్పులు తిరిగి చెల్లిస్తున్నారా, నిబంధనల మేరకు సంఘాలను నిర్వహిస్తున్నారా? తదితర అంశాలను పరిశీలించేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో), వారిపై టీఎంసీ, ఏడీఎంసీ, డీఎంసీ, వారందరిపై ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉన్నారు. వారందరికీ మహిళా సమాఖ్యలతోపాటు అదనపు సంక్షేమ పథకాల బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు. దీంతో సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. పొదుపు సంఘాల్లో జరుగుతున్న గందరగోళంతో చాలామంది మహిళలు ఇబ్బందులు పడటమే కాకుండా కొందరు సంఘాల నుంచి వైదొలుగుతున్నారు. మరికొన్ని సంఘాలను రద్దు చేసుకుంటున్నారు.

శిక్షణకు ఉపయోగం

జిల్లా కేంద్రం పెద్దపల్లి లో బ్యాడ్మింటన్‌ ఇండో ర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. దీనిద్వారా జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు నైపుణ్యం పెంచుకుంటారు. పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తారు.

– విజయ్‌, కోచ్‌, గోదావరిఖని

క్రీడలకు ప్రోత్సాహం

బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనతో నే పెద్దపల్లిలో ఇండోర్‌ స్టేడి యం ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు త్వరలోనే మొదలవుతాయి. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం చేపట్టిన నిర్మాణాలను ఇండోర్‌స్టేడియం కోసం ఉపయోగిస్తాం.

– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి

100శాతం రికవరీ చేస్తాం

సీ్త్రనిధి రుణాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో అక్రమాలకు పాల్పడిన వారినుంచి 100శాతం సొమ్ము రికవరీ చేస్తాం. ఇప్పటికే కలెక్టర్‌ 15 రోజుల్లో చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరించాం. బకాయిలు చెల్లిస్తేనే కొత్తగా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావొచ్చు.

– కాళిందిని, డీఆర్‌డీవో

రిక‘వర్రీ’ 1
1/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 2
2/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 3
3/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 4
4/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 5
5/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 6
6/7

రిక‘వర్రీ’

రిక‘వర్రీ’ 7
7/7

రిక‘వర్రీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement