
రైతులను గోస పెడుతున్నరు
పెద్దపల్లిరూరల్: కేసీఆర్ పాలనలో వ్యవసా యం పండుగలా సాగితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు సాగునీరు, ఎరువులు, రైతుబంధు కోసం గోసపడుతున్నరని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో శనివారం మా జీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్‌తో కలిసి ఆయన వి లేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరంపై కక్ష పెంచుకుని ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. యూరియాను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నాయకులు రఘువీర్‌సింగ్, గంట రాములు, ఉప్పు రాజ్‌కుమార్, శ్రీకాంత్, గోపు ఐలయ్య, మారుతి, ప్ర శాంత్, శ్రీనివాస్, సాగర్, వెంకన్న, రామరాజు, రమణ, నరేశ్, చంద్రమౌళి, ముత్తయ్య, కుమా ర్, సంపత్, భూమయ్య, గట్టయ్య, పెగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీతోనే హక్కులు
రామగిరి(మంథని): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన గుర్తింపు కా ర్మిక సంఘంగా ఏఐటీయూసీతోనే సాధ్యమని ఆ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావు అన్నారు. ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ రాంచంద్రారెడ్డి అధ్యక్షతన ఓసీపీ–2లో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రమోషన్ పాలసీలో భాగంగా గ్రేడ్ –డీ నుంచి సీ, సీ నుంచి బీకి మార్పు కోసం యాజమాన్యంతో చర్చించగా, త్వరలోనే ప్రమోషన్ ఉత్తర్వు వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులుజూపాక రాంచందర్, శ్రీనివాస్, అమరగండ పోశం తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించా లని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశా రు. శనివారం ఆర్జీ–1 జీఎంకు వినతిపత్రం అందజేసి జీఎం ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రతీనెల ఒకటి నుంచి ఏడో తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఒక్కో గార్డు కు నెలకు 26 మస్టర్లు ఇచ్చేలా చూడాలని కో రారు. ఏడేళ్లుగా సీఎంపీఎఫ్ చిట్టీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సౌక ర్యం కల్పించి, రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. నాయకులు ఎల్లా గౌడ్, గౌస్, సయ్యద్ సోహెల్ పాల్గొన్నారు.
రైతుబంధుకు దరఖాస్తు చేసుకోండి
పెద్దపల్లిరూరల్: ఈఏడాది జూన్ 5వ తేదీలోగా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రై తులు ఈనెల13లోగా రైతుబీమా పథకం కో సం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికా రి అలివేణి సూచించారు. 14 ఆగస్టు 1966 నుంచి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన (18 నుంచి 59ఏళ్ల మధ్య వయసు) రైతులు మా త్రమే బీమాకు అర్హులని ఆమె వివరించారు.
పవర్ కట్ ప్రాంతాలు
పెద్దపల్లిరూరల్: స్థానిక ఇండేన్ గ్యాస్ గోదాం, బీసీ హాస్టల్ ఏరియాతోపాటు పెద్దబొంకూర్, పెద్దకల్వల, నిట్టూరు, నిమ్మనపల్లిలో ఆదివా రం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెవిపారు. సబ్‌స్టేషన్‌తోపాటు విద్యుత్ స్తంభాల మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వివరించారు.
‘శక్తిపుంజ్’ను పొడిగించాలి
గోదావరిఖని: శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్ రైలును సి కింద్రాబాద్ వరకు పొడిగించాలని బీఎంఎస్ జాతీయ నేత కొత్తకాపు లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎంపీ ఈటెల రాజేందర్ ద్వారా కేంద్రరైల్వే శాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌కు లేఖ పంపించారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని కోల్ ఇండియాకు చెందిన 8 అనుబంధ సంస్థలు, తెలంగాణలోని సింగరేణిలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగుల బ దిలీలు, కుటుంబ సభ్యుల రాకపోకలు, పండుగలు, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భా ల్లో ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందన్నా రు. కోల్‌బెల్ట్‌వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా రైలును పొడిగించేలా చూడాలన్నారు.

రైతులను గోస పెడుతున్నరు

రైతులను గోస పెడుతున్నరు