
ఇంటిగ్రేటెడ్.. ఇక ‘ఇండోర్’
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇటీవల రూ.2.30కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లయ్యింది.
వ్యవసాయ మార్కెట్‌లో స్టేడియం
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం కొన్నేళ్ల క్రితం నిర్మాణా లు చేపట్టారు. అవి ఇంకా పూర్తికాలేదు. పైగా ఏళ్లు గా అసంపూర్తిగా ఉంటున్నాయి. దీనికితోడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుపై స్థానికులు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష.. అసంపూర్తి నిర్మాణాలను బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం కోసం వినియోగించేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
పారిశ్రామిక ప్రాంతాల్లోనే క్రీడలు..
బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆడుకునేందుకు అనువైన కోర్టులు లేక అవస్థలు పడుతున్నారు. ఆసక్తి గలవారు బసంత్‌నగర్‌లోని అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, సింగరేణి స్టేడియంలోకి వెళ్లి ఆడుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఇండోర్ నిర్మాణం చేపట్టనుండడంతో క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెట్టే అవకావం ఏర్పడింది.
రూ.2.30 కోట్లు మంజూరు..
బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.2.30 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వ్యవసాయ మార్కెట్‌లో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలను సద్వినియోగం చేసుకుంటూనే ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించారు. వీలైనంత త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
ఇంటిగ్రేటెడ్ ఇంతే సంగతులు..
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ నియోజవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే.. ప్రజాభీష్టం మేరకు ప్రధాన కూరగాయల మార్కెట్‌ను యథాస్థానంలోనే కొనసాగిస్తాననే హామీ మేరకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, శ్రీధర్‌బాబుతో సంప్రదించారు. ఈమేరకు కూరగాయల మార్కెట్ పనులకు యథాస్థానంలోనే శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినట్లయ్యింది.
బ్మాడ్మింటన్ స్టేడియం నిర్మాణానికి నిధులు
రూ.2.30 కోట్లతో పనులు
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రోత్సాహం