
ఆదివాసీలను అంతం చేసేందుకు కుట్ర
● ప్రజాసంఘాల నేతల నిరసన
పెద్దపల్లిరూరల్: బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే కేంద్రప్రభుత్వం ఆదివాసీలపై ఉక్కుపాదం మోపి అంతం చేసేందుకు కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధా నకార్యదర్శు లు బొంకూరి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి, మాదన కు మారస్వామి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని అమ రవీరుల స్తూపం వద్ద శనివారం ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ, అడవుల్లో ఆదివాసీలు లేకుండా చేసేందుకే బస్తర్‌లో 250 పోలీస్ క్యాంపులు ఏర్పాటు చే సిందన్నారు. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్‌హంట్, 2015లో ఆపరేషన్ సమాధాన్, 2024లో ఆపరేషణ్ కగార్ పేరిట నరమేధం సాగిస్తోందని పేర్కొన్నారు. నాయకులు నారా వినోద్, ఎరుకల రాజన్న, విశ్వనాథ్, రత్నకుమార్, రామిళ్ల బాపు, గాండ్ల మల్లేశ్, పర్వతాలు, రాజలింగయ్య, సత్యనారాయణ, శంకర్, స్వామి పాల్గొన్నారు.