పంద్రాగస్టుకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

Aug 9 2025 8:32 AM | Updated on Aug 9 2025 8:32 AM

పంద్ర

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

పెద్దపల్లిరూరల్‌: కలెక్టరేట్‌లో ఈనెల 15న ని ర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమా నికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన పలువురు అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. డీసీపీ కరుణాకర్‌, ఏసీపీ కృష్ణ, ఆర్డీవో గంగ య్య, సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

గోమాతకు పూజలు

జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజారి నవీ న్‌ ఆధ్వర్యంలో గోమాతకు పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పొట్టాల మల్లేశం, వెంకటరమణ, మహిళలు పాల్గొన్నారు.

బల్దియాలో డ్రై డే.. ఫ్రైడే

కోల్‌సిటీ(రామగుండం): వందరోజుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించారు. స్థానిక పరశు రామ్‌నగర్‌లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రం చేశా రు. ఫైవింక్లయిన్‌ ఏరియా, అశోక్‌నగర్‌లో డ్రైనేజీల్లో పూడిక తొలగించారు. నిల్వనీటిలో ఆయి ల్‌ బాల్స్‌ వేశారు. ఆర్వో ఆంజనేయులు, ఆర్‌ఐ శంకర్‌రావు, ఎస్సై నాగ భూషణం ఉన్నారు.

ఇసుక తవ్వకంపై నిషేధం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇసుక అక్రమ ర వాణా నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించిన గోదావరి నదిలోని రీ చ్‌ల నుంచి ఇసుక తీయడాన్ని నిషేధించామని రామగుండం తహసీల్దార్‌ ఈశ్వర్‌ తెలిపారు. క లెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్లు, లారీ ద్వారా గోదా వరి నుంచి ఇసుక తరలించడం, రవాణా చేయడం, డంపులు చేయడాన్ని నిషేఽధించామని, ఉ ల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

జీడీకే–11గని సందర్శన

గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే–11గనిని హైడ్రోలజిస్ట్‌ వేణు, హైడ్రో జియోలజిస్ట్‌ సుజాత శుక్రవారం సందర్శించారు. పెద్దంపేట షాఫ్ట్‌ వద్ద గ ల భూగర్భ జలాలను పరిశీలించారు. అంతకుముందు గని ఏజెంట్‌ కార్యాలయంలో సీమ్‌ లు, ప్యానెళ్లు, గనిప్లాన్‌ పరిశీలించారు. పర్యావరణ అధికారి ఆంజనేయప్రసాద్‌, గని ఏజెంట్‌ శ్రీనివాస్‌, పర్యావరణ అధికారి వసీంఅక్రం, పిట్‌ ఇంజినీర్‌ రాకేశ్‌ తదితరులు ఉన్నారు.

జీజీహెచ్‌ డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా అరుణ

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహె చ్‌) డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా గై నిక్‌ హెచ్‌వోడీ, ప్రొఫెసర్‌ అరుణ నియమితులయ్యారు. శుక్రవారం జీజీహెచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచలన మేరకు అరుణ ను డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా ని యమించినట్లు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌ తెలిపారు.

కదిలిన బల్దియా యంత్రాంగం

కోల్‌సిటీ(రామగుండం): రా మగుండం నగరంలోని కేసీఆర్‌ కాలనీ, ప్రగతినగర్‌, సాయినగర్‌లో బల్దియా అధికార యంత్రాంగం శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ‘ఫీవర్‌.. ఫియర్‌’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనంతో బల్దియా క మిషనర్‌ అరుణశ్రీ స్పందించారు. నగరంలో యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఓపెన్‌ప్లాట్ల యజమానులకు నో టీసులు జారీచేయాలని ఆదేశించారు. ఇటీవల మృతి చెందిన దీపక్‌ నివాసం సమీపంతోపా టు కాలనీల్లో బ్లీచింగ్‌ పౌండర్‌ చల్లించారు. కాలువల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. హెల్త్‌ అసిస్టెంట్‌ సంపత్‌ పర్యవేక్షించారు.

పంద్రాగస్టుకు ఏర్పాట్లు 1
1/4

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

పంద్రాగస్టుకు ఏర్పాట్లు 2
2/4

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

పంద్రాగస్టుకు ఏర్పాట్లు 3
3/4

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

పంద్రాగస్టుకు ఏర్పాట్లు 4
4/4

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement