
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
పెద్దపల్లిరూరల్/మంథని: జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వేలాది మంది ముత్తయిదువలు తొలుత ఆలయాలకు చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. తమ కుటుంబాలను, పసుపు, కుంకుమలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చీరెసారె సమర్పించారు. వాయినాలు ఇచ్చుకున్నారు. ఇళ్లలోనూ వ్రతాలు చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి సంతోషిమాత, మంథని
శ్రీమహాలక్ష్మీ, గోదావరిఖని, జ్యోతినగర్, రామగుండం తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం