
15 లోగా భూ సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: రెవెన్యూ సదస్సులు, ప్రజావా ణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలపై ఫిర్యా దులకు ఈనెల 15వ తేదీవరకు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి భూ సమస్యల పరిష్కారంపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. సింగరేణి, ఎన్టీపీసీ, జాతీయ రహదారుల భూసేకరణ పూర్తిచేయాలన్నారు. అగ్నిపథ్, ఎస్‌ఎస్ జీడీ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివరాలకు 99497 25997, 83330 44460 నంబర్లలో సంప్రదించాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కా ర్యాచరణ చేపట్టాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఈవో మాధవి, తహసీల్దార్లు ఉన్నారు.
గ్రీవెన్స్ సెల్‌పై దృష్టి పెట్టాలి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. జీజీహెచ్‌ని కలెక్టర్ తని ఖీ చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్ సింగ్, వైద్యాధికారులతో సమస్యపై సమీక్షించారు. టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ సానుకూ లంగా స్పందించారు. సీజనల్ వ్యాధులు, పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రిటికల్ కేర్ భవనం పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు అరుణ, రాజు, డాక్టర్లు అతుల్య, శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం బల్ది యా కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీతో పా రిశుధ్యం నిర్వహణపై సమీక్షించారు. ఆస్తిపన్ను పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి
రామగుండం: పీహెచ్‌సీలో వ్యాధి నిర్ధారణ పరీక్ష లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. రక్తపోటు, మధుమేహం బాధితులకు మందుల కిట్ అందించాలన్నారు. స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.