
ఆన్‌లైన్‌లోనే నల్లాబిల్లుల చెల్లింపు
● త్వరలోనే అందుబాటులోకి : కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని వినియోగ దారులు నల్లాబిల్లులు ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. నగరంలోని 11,472 నల్లాకనెక్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించగా శుక్రవారం వరకు 8,445 కనెక్షన్ల వివరాలు నమోదు చేసి రాష్ట్రంలో నే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. యూఎల్ బీ ద్వారా 20,660, అమృత్ పథకం ద్వారా 21,500.. మొత్తంగా 42,160 నల్లా కనెక్షన్లు నగ రంలో ఉన్నాయని వివరించారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు పూర్తయ్యాక ఆస్తిపన్ను వసూలు చేస్తున్న హాండ్ హెల్డ్ మిషన్లతోనే ఏకకాలంలో నల్లాబిల్లులు కూ డా వసూలు చే యడానికి అవకాశం ఉంటుంద ని వెల్లడించారు. వినియోగదారు కూడా తన స్మా ర్ట్ ఫోన్‌తో ఎక్క డి నుంచైనా బి ల్లు చెల్లించే సౌక ర్యం ఉంటుందని వివరించారు. నగరపాలక సంస్థపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని, త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సౌకర్యాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకొని బల్దియాకు సహరించాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు.