
ఇద్దరు అధికారుల సరెండర్
● విధి నిర్వహణలో నిర్లక్ష్యమే కారణం
కోల్‌సిటీ(రామ గుండం): వి ధుల్లో నిర్లక్ష్యం వహించిన రా మగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.హనుమంతరావు నాయక్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ డి.కిరణ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్ లో వివరాలు సకాలంలో అప్‌డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం, టీయూఎఫ్‌ఐడీసీ తదితర పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడంలో అలసత్వం వహించడంతో ఇద్దరు ఉద్యోగులను సరెండర్ చేశావని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివరించారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరంలో చేపట్టాల్సిన పారిశుధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతోపాటు తనకు కేటాయించిన డివిజన్లలో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌నూ సరెండర్ చేశామని ఆమె వివరించారు.

ఇద్దరు అధికారుల సరెండర్