అంబేడ్కర్ మార్గం అనుసరణీయం
పెద్దపల్లిరూరల్/రామగుండం/సుల్తానాబాద్: అంబేడ్కర్ చూపిన మార్గం అనుసరణీయమని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. సంజీవరెడ్డి రా మగుండంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నాయకు లు ఠాకూర్ రాంసింగ్, మోర మనోహర్, అరుణ్, స తీశ్, సదానందం, శ్రీనివాసరావు, దిలీప్‌కుమార్, చ క్రధర్‌రెడ్డి, రాజేందర్, రమేశ్, నర్సింగం, మంథని కృష్ణ, రవి, వంశీ, రవీందర్, వెంకటేశం ఉన్నారు. కాగా, సుల్తానాబాద్‌లో ఈనెల 15న నిర్వహించే బీ జేపీ ఆత్మీక సమ్మేళనానికి ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి హాజరవుతారని సంజీవరెడ్డి తెలిపారు.


