
వేలానికి మా యూనియన్ వ్యతిరేకం
బొగ్గు గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సింగరేణిలో కార్మికుల ఓట్లతో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందిన నాయకులు వేలానికి అనుకూలంగా మంత్రికి లేఖ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిద్వారా సంస్థకు తీరని అన్యాయం జరుగుతుంది.
– తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ
మంత్రిని కలుస్తాం
గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు వేలానికి అనుకూలంగా లేఖ ఇవ్వడం సరికాదు. గతంలో డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవిస్తాం. ఇప్పటికే ఐక్యవేదిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. గెలిచిన కార్మిక సంఘాల తీరును ఎండగడుతాం. భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– రియాజ్ అహ్మద్, ఐక్య వేదిక కన్వీనర్

వేలానికి మా యూనియన్ వ్యతిరేకం