
అజాత శత్రువు శ్రీపాదరావు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: అజాత శత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా స్థాని క బస్టాండ్ ఎదుట ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి ఘనంగా నివా ళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీపాదరా వు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అ న్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన సే వలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, పెద్దెల్లి ప్రకా శ్, తిపారపు శ్రీనివాస్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
హనుమాన్ విగ్రహ పనుల పరిశీలన
రామగుండం: రామునిగుండాల కొండపై చేపట్టిన 108 అడుగుల విగ్రహ నిర్మాణ ప్రగతిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ శనివారం రాత్రి పరిశీలించారు. పనుల్లో పురోగతి, బడ్జెట్, సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాలిపెల్లి తిరుపతి, నాయకులు కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, సంగణవేణి శేఖర్ పాల్గొన్నారు.