
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
గోదావరిఖని: రాజ్యాంగ పరిరక్షణ ప్రతీపౌరుని బా ధ్యత అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో రాజ్యాంగ పరిరక్షణ యా త్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ‘విభజించి పాలించు’ పద్ధతితో దేశాన్ని ము క్కలు చేస్తోందని విమర్శించారు. సామాన్యుల హ క్కులు కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులు, ధనవంతు లకే మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్మాన్ని కాపాడాలి
ఓదెల(పెద్దపల్లి): రూపునారాయణపేట భక్తాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణారావు–పావని దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి