మోదీ పాలనకు ప్రజామోదం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీతివంతమైన పాలననే ప్రజానీ కం కోరుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు క ర్రె సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీ జేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వారు స మావేశమయ్యారు. ప్రపంచంలోని అగ్రదేశాలకు తీసిపోని విధంగా మనదేశాన్ని ప్రధాని తీర్చిదిద్దారని వారు అన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీకార్యకర్త, నాయకుడు ఇంటింటికీ తీసుకెళ్లాలని వారు కోరారు. నాయకులు జంగ చక్రధర్‌రెడ్డి, ఠాకూర్‌రాంసింగ్, అల్లెంకి ప్రకాశ్, నర్సింగ్, సతీశ్, దిలీప్‌కుమార్, సమ్మయ్య, శ్రీనివాసరావు, రవి, మంథెన కృష్ణ, రాజేందర్, మనోహర్, నరేశ్, గోపి, రమేశ్, మల్లారెడ్డి, సందీప్, పిట్టల వినయ్, సంతోష్, రాజేశ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియావైపు ప్రపంచ దేశాల చూపు..
ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుల్తానాబాద్ సుభాష్‌నగర్‌లో చేపట్టిన ‘గాం చలో – బస్తీ చలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, చాతరాజు రమేశ్, కూకట్ల నాగరాజు, వేగోళం శ్రీనివాస్‌గౌడ్, లంక శంకర్, ఏగోలపు సదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


