
ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ‘ఇచ్చట లింగనిర్ధారణ చేయరు.. ఇలా చేయడం కూడా చట్టరీత్యా నేరం’ అని రాసిన బోర్డులను అందరికీ కనిపించేలా డయాగ్నొస్టిక్ కేంద్రాల ఎదుట అమర్చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మంగళ వారం పట్టణంలోని పలు డయాగ్నొస్టిక్ కేంద్రాల ను తనిఖీ చేశారు. పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైద్య పరీక్షల కోసం వచ్చేవారినుంచి నిబంధనల ప్రకారమే ీఫీజుల వసూలు చేయాలని ఆమె సూచించారు. ఫీజుల వివరాలను తెలిపే పట్టికలను కూడా ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డులపై అంటించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను సైతం తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో.. అగ్నిమాపక పరికరాలను అమర్చుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఎవరూ లింగనిర్ధారణ చేయొద్దు
నిబంధనల మేరకు ఫీజు వసూలు చేయాలి
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్నకుమారి
ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు