
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ ఖని న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. ము న్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వా జి శ్రీనివాస్, కమిటీ కార్యవర్గ సభ్యులు గోసిక ప్రకాశ్, పులిపాక ప్రవీ ణ్‌కుమార్, వరలక్ష్మి, చందాల శైలజ, గొర్రె రమేశ్, అరుణ్, రాజేశ్, వెంకట్, రంగు శ్రీనివాస్, నూతి సురేశ్, సహనవాజ్, రవీందర్, ప్రసన్న, అంజలి తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 27న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. అపోలో ఫార్మసీలో 50 ఫార్మసిస్టు, ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్‌ట్రేనీ పో స్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు 82476 56356, 89853 36947లో సంప్రదించాలన్నారు.