● కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ టీంల రద్దు
ఎల్‌ఆర్‘ఎస్’ మేళా
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించి 25శాతం రాయితీ పొందడంతోపాటు తమ భూ ములు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందు కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని వేలాది మంది అర్జీదా రులు రుసుం చెల్లించేందుకు బల్దియాల్లో బారులు తీరుతున్నారు. పెద్దపల్లిలోని మేళా వద్ద క్యూకట్టిన అర్జీదారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
గోదావరిఖని: చోరీల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్ర మాదాలను అదుపు చేయడం.. మొత్తంగా శాంతి భద్రతల పరిక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన రెండురోజులకే రైల్వే, బస్‌స్టేషన్లు, బొగ్గు చోరీలు జరిగే ప్రాంతాలను ఆయన అర్ధరాత్రి ప రిశీలించారు. పోలీసుశాఖ ప్రక్షాళనకూ నడుం బి గించారు. కమిషనరేట్‌లో కీలకమైన టాస్క్‌ఫోర్స్ టీంలను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ కమిషనర్ ఝా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులోని అధికారులు, సిబ్బందిని సొంత ప్రాంతాలకు పంపించి వేశారు.
మహిళల భద్రతపైనా ప్రత్యేక దృష్టి
మహిళల రక్షణ, భద్రతపైనా పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందుకోసం కాలేజీల్లో ఈవిటీజింగ్, పలు రద్దీ ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను నియమించాలని నిర్ణయించారు.
బ్లాక్‌స్పాట్‌లపై చర్యలు
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లపై సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాదారులను అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డుల ఏర్పాటు, రాత్రిపూట స్పష్టంగా కనిపించే డేంజర్ రేడియం స్టిక్కర్లు అతికించాలని ఆదేశాలిచ్చారు. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, స్పీడ్‌గన్‌లతో నిఘా పెంచడం, రోడ్లపై రిఫ్లెక్టింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.
డ్రగ్స్ నియంత్రణకు సీరియస్‌గా ముందుకు
రామగుండం కమిషరేట్ పరిధిలో గంజాయి, ఇతర మారకద్రవ్యాలను కట్టడిచేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎంతటి వారున్నా ఊరుకోబోమని, సీరియస్‌గా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యం
మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మా లక్ష్యం. టాస్క్‌ఫోర్స్ టీంలను ఎత్తివేశాం. ప్రమాద, గంజా యి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇదే సమయంలో యువత ఉపాధిపై దృష్టి సారిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా
– పోలీస్ కమిషనర్, రామగుండం
పోలీస్ బాస్.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు