● రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు
మంథని: ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి రూ.3వేల కోట్లకు పైగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తా ర్ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం అమలు చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, ఇన్‌చార్జి తహసీల్దార్ గిరి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, కొండ శంకర్, కొత్త శ్రీనివాస్, పెండ్రు రమాదేవి, మూల సరోజన, మంథని సురేశ్, ఆజీంఖాన్, ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.