మంథని: జాతీయస్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అ వార్డు పొందిన మంథని మండలం చిల్లపల్లి గ్రామాన్ని గురువారం రాజస్థాన్ నుంచి 19 మంది ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రతినిధులకు మహిళలు బతుక మ్మ, కోలాటాలతో స్వాగతం పలికారు. గ్రా మంలో ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులు పరిశీలించారు. తమ రాష్ట్ర పంచా యతీరాజ్ మంత్రి సూచనలతో ఇక్కడకు వ చ్చినట్లు రాజస్థాన్ బృందం తెలిపింది. ఇక్కడి మహిళల పనితీరు బాగుందని, ఈ పర్యటన తమకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది. స్టేట్ నోడల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
11 టీఎంసీలకు ‘ఎల్లంపల్లి’
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. గురువారం నీటిపారుదలశాఖ అధికారులు తెలిపిన నివేదిక ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.28 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి గూడెం ఎత్తిపోతలు 290 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, వేంనూర్ ఎత్తిపోతలు 494 క్యూసెక్కులు మొత్తం 1,357 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండగా ఇన్‌ఫ్లో మాత్రం లేదు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని నోడల్ అధికారిణి కల్పన తెలిపారు. గురువారం జరిగిన పరీక్షకు 4,532 మందికిగాను 4,428 మంది హాజరయ్యారని, 104మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు.
నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానా
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలో నిబంధనలు పాటిచకుండా మాంసం వ్యాపారులు దుకాణాల వద్దే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. దీంతో అదనపు కలెక్టర్, నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ ఆదేశాలతో గురువారం డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో పారిశుధ్య విభాగం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల వద్ద మేకలను వధిస్తున్న ముగ్గురు వ్యాపారులను గుర్తించి ఒకొక్కరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.
ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలు సీజ్
రామగుండం బల్దియాలో ఆస్తిపన్ను చెల్లించని వ్యాపార సంస్థలను గురువారం అధికారులు సీజ్ చేశారు. స్థానిక లక్ష్మీనగర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా పలుదఫా లుగా నోటీసులు జారీ చేసినా, స్పందించని నా లుగు వ్యాపార సంస్థలను నగరపాలక కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రెవెన్యూ విభా గం అధికారులు సీజ్ చేశారు. కార్యక్రమాల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగ భూషణం, ఎ న్వి రాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, సూపర్‌వైజ ర్ దయానంద్, సంపత్, ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రాజస్థాన్ బృందం సందర్శన
రాజస్థాన్ బృందం సందర్శన