గోదావరిఖనిటౌన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాయంతో విద్యాబోధన చేయడం ద్వారా వి ద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక గాంధీపార్క్ మండల పరిషత్ ప్రాథమిక, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఏఐ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించడం లక్ష్యంగా ఏఐ పద్ధతి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ సాయంతో విద్యా బోధన ప్రారంభిస్తున్నామని తెలిపారు. డీఈవో మాధవి, ఏఎంవో పీఎం షేక్, ఎంఈవో చంద్ర య్య, జిల్లా రిసోర్సు పర్సన్‌లు ప్రవీణ్, రవి, ప్ర ధానోపాధ్యాయుడు రాంబాబు పాల్గొన్నారు.
సాగునీటిని వృథా చేయొద్దు
పెద్దపల్లిరూరల్: ఎస్సారెస్పీ నీటిని వృథా చేయొ ద్దని, చివరి ఆయకట్టుకూ అందేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అప్పన్నపేట ఎస్సారెస్పీ డి–83 ప్రధాన కాలువ నీటి ప్రవాహాన్ని ఈఈ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పంటలకు అవసరమైన నీటి వినియోగంపై రైతులకు అవగాహన అవససరమన్నారు.
బాలసదనం సందర్శన..
స్థానిక బాలసదనం కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. పిల్లల సంఖ్య, వసతులపై ఆరా తీశా రు. పిల్లలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. నిధులు అవసరమైతే తనకు ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానన్నారు.
ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు
రామగుండం/కోల్‌సిటీ/ఫెర్టిలైజర్‌సిటీ: చదువు లో ప్రతిభచూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండంలోని తబితా, వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమాలను ఆయన మంగళవారం సందర్శించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితనిఖీ చేశారు. అధికారులు ఉన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష