జిల్లాలోనే అతిపెద్ద, ఒకేఒక నగరపాలక సంస్థ రామగుండం. పరిశ్రమలకు నిలయం. ఇరవై ఏండ్లుగా డంపింగ్‌యార్డ్‌కు స్థలం లేదు. గత ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఈ సర్కారైనా పట్టించుకోవాలి. ప్రభుత్వం బయో మైనింగ్ ఏర్పాటు చేయాలి.
– మద్దెల దినేశ్, అధ్యక్షుడు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ
టెండర్లు పిలిచాం
ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా డంపింగ్ యార్డుగా వినిగిస్తున్నాం. ఇందుకోసం డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్‌సీసీ) కోసం టెండర్లు పిలిచాం. బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. సేంద్రియ ఎరువు తయారు చేస్తాం.
– అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్‌ఏసీ)
బయోమైనింగ్ అవసరం