మా ఊరు శివారులోని సర్వే నంబరు 315/2లో నాకు వారసత్వంగా వచ్చిన భూమి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలి. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న ఫలాలను అధికారుల తప్పిదంతో పొందలేక పోతున్న. వీలైనంత త్వరగా పొరపాటును సవరించి పాసుపుస్తకం అందించి నాకు న్యాయం చేయాలి. – దేవ లాలయ్య, భోజన్నపేట
కార్యదర్శి లేక కష్టాలు
రామగిరి మండలం వెంకట్రావుపల్లికి పంచాయతీ కార్యదర్శిలేరు. ఏ పనీ ముందుకు సాగడం లేదు. కనీసం పారిశుధ్య పనులు కూడా చేపట్టడంలేదు. గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిని నియమించేలా చర్యలు తీసుకోవాలి.
– బత్తిని శ్రీనివాస్,
మాజీ ఎంపీటీసీ, వెంకట్రావుపల్లి
వంతెన నిర్మించాలి
మా ఊరు పంట పొలాల్లోకి వెళ్లేందుకు ఊరచెరువు వద్ద వంతెన నిర్మించాలి. చెరువు వద్ద నిర్మించిన మత్తడి నుంచి వచ్చే వరదతో అటువైపు వెళ్లలేకపోతున్నాం. కాల్వపై వంతెన నిర్మించేలా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలి.
– నిట్టూరు గ్రామ రైతులు
పాసుబుక్కు ఇప్పించాలి
పాసుబుక్కు ఇప్పించాలి