● 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
జ్యోతినగర్(రామగుండం): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి రెండోవారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇళ్లలోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఆకెనపల్లిలో పగటిపూట గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్‌లో)
తేదీ గరిష్టం కనిష్టం
06 34.4 19.6
07 34.8 13.6
08 36.0 14.2
09 37.0 15.3
10 34.4 18.6
11 33.6 20.6
12 40.3 28.9


