గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Mar 5 2025 1:14 AM | Updated on Mar 5 2025 1:11 AM

పెద్దపల్లిరూరల్‌: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని ఎస్సై లక్ష్మ ణ్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 1న పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో అచేతనంగా పడివున్న గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడు నీలిరంగు ఫుల్‌ టీషర్ట్‌, ఆకుపచ్చ లుంగీ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 87126 56506, 87126 56507 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు.

టిప్పర్‌ ఢీకొని ఒకరి దుర్మరణం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ కథనం ప్రకారం.. ముస్తాబాద్‌ మండలం బందనకల్‌ గ్రామానికి చెందిన నక్క శంకరయ్య(49) మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా మైలారం గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో అనంతారం సమీపంలో అన్నపూర్ణ ప్రాజెక్టు కెనాల్‌ వద్ద టిప్పర్‌ ఢీకొట్టింది. రోడ్డుపై పడిన శంకరయ్య పైనుంచి టిప్పర్‌ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం ముద్దలు ముద్దలుగా రోడ్డంతా పడింది. పోలీసులు పారలతో కుప్పగా చేసి, సంచిలో నింపి, ఆస్పతికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

యువకుడి ఆత్మహత్య

మానకొండూర్‌: లక్ష్మీపూర్‌ కు చెందిన కొమ్మగల్ల పవన్‌కల్యాణ్‌(22) ఆత్మహత్య చే సుకున్నట్లు సీఐ లక్ష్మీనారా యణ తెలిపారు. పవన్‌కల్యాణ్‌ సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఎదుట రేకుల షెడ్డులో నిద్రించాడు. 11 గంటల సమయంలో చలి వేస్తోందని, ఇంట్లో పడుకుంటానని చెప్పి వెళ్లాడు. 1.20 గంటలకు ఇంట్లో నుంచి శబ్ధం వినిపించడంతో తల్లిదండ్రులు నిద్ర లేచారు. లోపలికి వెళ్లి చూడగా కుమారుడు పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని, కనిపించాడు. కాగా, మూడు రోజులుగా తమ కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడని, గ్రా మంలోనే చికిత్స పొందినా తగ్గలేదన్నారు. దీంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముగ్గురు ఏజెంట్ల అరెస్టు

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌): విదేశాల్లో ఉద్యోగా లు ఇప్పిస్తామంటూ నిజామాబాద్‌ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అ రెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సైబర్‌ క్రై మ్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు మంగళవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్‌, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్‌, లావోస్‌ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశా రు. వీరిని లావోస్‌ దేశంలో బంధించి సైబర్‌ నే రాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. వీరిని సారంగాపూర్‌ జిల్లా జైలుకు తరలించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి1
1/2

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి2
2/2

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement