అవిశ్వాస తీర్మానం.. జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్‌ | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాస తీర్మానం.. జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్‌

Jan 21 2024 11:52 PM | Updated on Jan 22 2024 5:24 PM

- - Sakshi

పెద్దపల్లి: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు అసమ్మతి సెగ రోజుకోతీరులో వెంటాడుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఏం చేయాలో తోచక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. అసమ్మతి కార్పొరేటర్లు ఆదివారం మరోసారి భేటీ అయ్యారని తెలిసింది.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సుమారు 26 మంది సంతకాలు చేశారని, ఇదే విషయాన్ని అసమ్మతి వర్గంలోని కొందరు కార్పొరేటర్లు వెల్లడిస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం పత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ తర్వాత నేరుగా క్యాంపు కోసం గజ్వే ల్‌ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని సమాచారం. అయితే, కలెక్టరుకు నోటీసు ఇచ్చాకే వివరాలు వెల్లడిస్తామని అసంతృప్తి కార్పొరేటర్లు చెబుతున్నారు.

అప్పుడు మౌనం..

  • రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ స్పందించి అసంతృప్తి కార్పొరేటర్లతో గతనెలలో నేరుగా సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్ట వద్దని అందరికీ ఆయన నచ్చజెప్పారు.
  • ఆ తర్వాత మౌనం వహించిన అసంతృప్తి కార్పొరేటర్లు.. ఇప్పుడు మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
  • అవిశ్వాస తీర్మానానికి అందరూ కట్టుబడి ఉన్నారని, 26 మంది ఇప్పటికే సంతకాలు చేశారని, వారందరినీ క్యాంపుకు తరలించడానికి రంగం సిద్ధం చేశారని సంకేతాలు ఇచ్చారు.
  • మరోసారి జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్‌.. శనివారం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారని తెలిసింది.
  • అవిశ్వాసం తీర్మానం, క్యాంపు రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారని సమాచారం.
  • బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే విప్‌ జారీచేయాల్సి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అందరికీ నచ్చజెప్పారని సమాచారం.
  • అయినా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికే పట్టుపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
  • రెండ్రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి.

ఇవి చదవండి: ఎట్టకేలకు షబ్బీర్‌ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement