మళ్లీ నేనే ఎమ్మెల్యేను | - | Sakshi
Sakshi News home page

మళ్లీ నేనే ఎమ్మెల్యేను

Dec 2 2023 12:50 AM | Updated on Dec 2 2023 12:54 PM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌ - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు ఈఎన్నికల్లో తనను గెలిపిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నిర్విరామ కృషితో తిరిగి తానే ఎమ్మెల్యేగా గెలువబోతున్నానన్నారు. రానున్న అయిదేళ్లలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు రెండు నెలల పాటు పథకాలను గడపగడపకూ తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారని అన్నారు.

రామగుండం నియోజకవర్గం చైతన్యానికి మారుపేరని, ఉద్యమకారులను కన్నగడ్డ అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్‌ అభ్యర్థి అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. తాను ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఓటర్లకు మద్యం, మాంసం పంచలేదని, ఒక్కరూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. ప్రజలు ధర్మం, న్యాయం వైపే ఉన్నారని పేర్కొన్నారు. నాయకులు ఆముల నారాయణ, కుమ్మరి శ్రీనివాస్‌, బాదే అంజలి, తస్నీమ్‌ భాను, పీటీ స్వామి, కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్‌, పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు పండ్లు పంపిణీ
రామగుండం:
కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ గెలుపును కాంక్షిస్తూ అభిమానులు శుక్రవారం పట్టణంలోని తబితా ఆశ్రమంలో చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జూల విజయ్‌, రవీందర్‌, లంక రాజలింగు, జూల అజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement