
కేసు నమోదు చేస్తున్న సీఐ రమేశ్
గోదావరిఖని: ఎన్నికల కమిషన్‌కు సకాలంలో సేల్స్ వివరాలందించని రెండు మద్యం దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్సజ్ సీఐ సుంకరి రమేశ్ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు ప్రతిరోజు రాత్రి 11 గంటల్లోపు ఆయా బ్రాందీషాపుల సేల్స్ వివరాలు పెట్టాలని అన్ని షాపులకు చెప్పినా.. యజమానులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన తెలంగాణ వైన్స్, గోదావరిఖని మార్కెట్ వద్ద గల దుర్గావైన్స్‌పై నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్ రిజిస్టర్ కేసు నమోదు చేసి రూ.15 వేల చొప్పున జరిమానా విధించామన్నారు.